Advertisement

  • కరోనా బారినపడి కన్నుమూసిన నేత ఒకరు అమెరికా ఎన్నికల్లో విజయం

కరోనా బారినపడి కన్నుమూసిన నేత ఒకరు అమెరికా ఎన్నికల్లో విజయం

By: chandrasekar Thu, 05 Nov 2020 10:27 AM

కరోనా బారినపడి కన్నుమూసిన నేత ఒకరు అమెరికా ఎన్నికల్లో విజయం


కరోనా ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా బారినపడి కన్నుమూసిన నేత ఒకరు అమెరికా ఎన్నికల్లో విజయం సాధించారు. అమెరికా ఎన్నికల ఫలితాల కోసం ఆ దేశ పౌరులతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ విషాద వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారినపడి కన్నుమూసిన నేత ఒకరు ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేకాదు ఆయన మరణించిన విషయం తెలిసి కూడా ఓటర్లు ఆయనకే పట్టం కట్టడం విశేషం. నార్త్ డ‌కోటాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీకి చెందిన డేవిడ్ అంద‌ల్ అక్టోబ‌ర్ 5వ తేదీన కొవిడ్-19 మహమ్మారి బారినపడి మ‌ర‌ణించారు. ఆయన వయసు 55 ఏళ్లు. నార్త్ డకోటాలోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేశారు. కరోనా వైరస్ సోకిన డేవిడ్ హాస్పిట‌ల్‌లో 4 రోజుల పాటు పోరాడి ప్రాణాలు విడిచారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రారంభమైన సంగతి తెలిసిందే. డేవిడ్ కొవిడ్‌-19తో మృతి చెందిన నెల రోజుల త‌ర్వాత పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అంతకుముందు నుంచే నమోదు చేశారు. డేవిడ్ లేకపోయినా ఓటర్లు ఆయనకు గౌరవం ఇచ్చి విజయం కట్టబెట్టారు. బుధవారం, నవంబర్ 4 న ప్రక‌టించిన ఫ‌లితాల్లో డేవిడ్ విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనకు 35 శాతం ఓట్లు పోలైన‌ట్లు సమాచారం. ప్రజలకు ఎంతో సేవ చేయాలని డేవిడ్ తపించారని ఆయన తల్లి మీడియాతో అన్నారు. రైతుల‌కు, బొగ్గు ప‌రిశ్రమ కార్మికులకు ఎంతో సేవ చేయాల‌ని భావించినట్లు తెలిపారు. నార్త్ డ‌కోటా రాష్ట్రంలోకి కరోనా వైరస్ ఆలస్యంగా ప్రవేశించినా ప్రస్తుతం అక్కడ కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటికే 2,32,000 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడ చాలా మంది కరోనా వల్ల ప్రాణాలు పోగుట్టుకున్నారు.

Tags :
|

Advertisement