Advertisement

  • యువత మీద కూడా కరోనా తీవ్ర ప్రభావం ..యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా

యువత మీద కూడా కరోనా తీవ్ర ప్రభావం ..యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా

By: Sankar Tue, 14 July 2020 11:41 AM

యువత మీద కూడా కరోనా తీవ్ర ప్రభావం ..యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా



ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర విజృంభణ చేస్తుంది ..అమెరికా , బ్రెజిల్ , ఇండియా , రష్యా వంటి దేశాలు ఈ మహమ్మారి దాటికి అతలాకుతలం అవుతున్నాయి ..అయితే ఇప్పటిదాకా అందరూ ఈ కరోనా కేవలం పెద్ద వాళ్ళు , చిన్న పిల్లల మీదనే ప్రభావం ఎక్కువగా చేయిస్తుంది అని , యువకులలో రెసిస్టన్స్ పవర్ ఎక్కువగా ఉండటం వలన యువత ఈ మహమ్మారికి బలి అవ్వరు అని భావించారు ..

అయితే కరోనా వైరస్​తో యువతకు పెద్ద ప్రమాదమేమి ఉండదనే వాదననను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కొట్టిపారేసింది. ప్రతి ముగ్గురు అమెరికన్​ యువకుల్లో ఒకరు కరోనా వల్ల తీవ్రంగా ప్రభావం చెందే అవకాశం ఉందని చెప్పింది. యూనివర్సిటీకి చెందిన బెనీఫ్ పిల్లల ఆసుపత్రిలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వారి శాంపిళ్లను పరిశీలించిన మీదట ఈ కామెంట్లు చేసింది..

ఇందుకు సంబంధించిన పూర్తి ఫలితాలను సోమవారం విడుదలైన అడాలసెంట్ హెల్త్ జర్నల్​లో వెల్లడించింది. గుండె జబ్బులు, డయాబెటిస్​, లివర్​ సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, పొగతాగడం, వ్యాధి నిరోధక శక్తి తదితరాలను పరిశీలనలోకి తీసుకుని అమెరికా వ్యాప్తంగా సేకరించిన 8,400 శాంపిళ్లలో 33 శాతం మంది మగాళ్లు, 30 శాతం మంది ఆడాళ్లు కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమవుతారని తేలిందని వివరించింది. మిగతా వాటితో పోల్చితే పొగతాగేవారు మరింతగా కరోనా వల్ల ఇబ్బందిపడతారని హెచ్చరించింది

Tags :
|
|
|
|
|
|
|

Advertisement