Advertisement

  • ఆన్లైన్ జూదం కారణంగా డాక్ యార్డు ఉద్యోగి ఆత్మహత్య

ఆన్లైన్ జూదం కారణంగా డాక్ యార్డు ఉద్యోగి ఆత్మహత్య

By: Sankar Sun, 15 Nov 2020 7:14 PM

ఆన్లైన్ జూదం కారణంగా డాక్ యార్డు ఉద్యోగి ఆత్మహత్య


ఆన్‌లైన్ జూదం మరొకరిని బలి తీసుకుంది. ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి.. లాక్ డౌన్ కాలంలో లక్షలు నష్టపోయిన ఓ డాక్‌యార్డు ఉద్యోగి చివరికి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన దారుణం విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా వుంటున్న డాక్‌యార్డు ఉద్యోగి గత ఎనిమిది నెలలుగా ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. లక్షల్లో నష్టపోయాడు.విశాఖపట్నం జిల్లాలోని గోపాల పట్నం మండలం కొత్తపాలెంలో నివాసముండే సతీష్ కుమార్ అనే వ్యక్తి డాక్ యార్డులో పని చేసేవాడు. లాక్ డౌన్ కారణంగా ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లోనే ఒంటరిగా వుంటున్న సతీష్ ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడ్డాడు.

వరుసగా ఆన్‌లైన్ జూదమాడడం వల్ల సతీష్ లక్షల్లో డబ్బు నష్టపోయాడు. తన వద్ద డబ్బు లేకపోయినా.. అప్పు తీసుకుని మరీ జూదమాడేవాడు సతీష్. ఈ క్రమంలో లక్షల్లో అప్పుల పాలైన సతీష్ అవి తీర్చే దారి లేకపోవడంతో శనివారం రాత్రి మేఘాద్రిగడ్డ డామ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :
|
|

Advertisement