Advertisement

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం ..ఒకరు మృతి

By: Sankar Mon, 10 Aug 2020 08:35 AM

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం ..ఒకరు మృతి



అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సరదాగా అంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకుంటున్న సమయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం బలిగొంది. మరో ఇరవై మంది గాయపడ్డారు. ఈ ఘటన వాషింగ్టన్‌ డీసీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఈ విషయం గురించి మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిపార్టుమెంట్‌ చీఫ్‌ పీటర్‌ నీషం మాట్లాడుతూ.. వందలాది మంది ఒక్కచోట చేరి అవుట్‌డోర్‌ పార్టీ చేసుకున్నట్లు తెలిపారు. ఫుడ్‌ లాగిస్తూ.. మ్యూజిక్‌ వింటూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వందలాది మంది ఒక్కచోట చేరి వీకెండ్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నారని, ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రత్యక్ష సాక్షులు ఈ విషయం గురించి చెబుతూ.. బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా గన్‌ఫైరింగ్‌ శబ్దాలు వినిపించాయని, అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని పేర్కొన్నారు. మరికొంత మంది కార్ల కింద దాక్కొన్నారని, అదో భయంకర ఘటన అని గుర్తు చేసుకున్నారు.

Tags :
|

Advertisement