Advertisement

  • ఆంధ్రప్రదేశ్ లో ఆ జిల్లాలో ఈ రోజు మొత్తం పూర్తి లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో ఆ జిల్లాలో ఈ రోజు మొత్తం పూర్తి లాక్ డౌన్

By: Sankar Sun, 23 Aug 2020 10:04 AM

ఆంధ్రప్రదేశ్ లో ఆ జిల్లాలో ఈ రోజు మొత్తం పూర్తి లాక్ డౌన్


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. నిత్యం పదివేల పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో శనివారం కరోనా కేసులు 10 వేలు దాటాయి

.జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడి యంత్రాంగాలు మరోసారి లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో లాక్ డౌన్ ప్రకటించింది జిల్లా యంత్రాంగం.

రేపు ఉదయం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగనుంది. వైద్య సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ అయ్యాయి. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దంటూ అధికారులు, పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

శనివారం కరోనా కారణంగా శ్రీకాకుళంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 47,989 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే ఆ జిల్లాలో అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. కర్ఫ్యూ కూడా విధించారు.

Tags :

Advertisement