Advertisement

  • ప్రపంచానికి ధోని పరిచయం అయి నేటికీ పదహారేళ్లు

ప్రపంచానికి ధోని పరిచయం అయి నేటికీ పదహారేళ్లు

By: Sankar Wed, 23 Dec 2020 12:28 PM

ప్రపంచానికి ధోని పరిచయం అయి నేటికీ పదహారేళ్లు


ఇండియన్ క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని..క్రికెట్ చరిత్రలో తనకంటూ ఎన్నో ప్రత్యేక రికార్డులు సొంతం చేసుకున్న ధోనికి ఈ రోజుకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది..అదే డిసెంబర్ 23 , 2004 న ధోని తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు..

బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా ధోని క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రం మ్యాచ్‌ను మంచి మెమొరబుల్‌గా మలుచుకోవాలని ప్రతి ఒక్క ఆటగాడు భావిస్తాడు. కానీ ఎంఎస్‌ ధోనికి మాత్రం తొలి మ్యాచ్‌ ఒక పీడకలగా మిగిలిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో ధోని తాను ఆడిన తొలి బంతికే రనౌట్‌ అయి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తపష్‌ బైష్యా, ఖాలీద్‌ మసూద్‌లు కలిసి ధోనిని రనౌట్‌ చేశారు..

ఇక 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మార్టిన్‌ గప్టిల్‌ వేసిన డైరెక్ట్‌ త్రో ద్వారా రనౌట్‌ అయ్యాడు. ఇక ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ బరిలోకి దిగలేదు. తన రిటైర్మెంట్‌పై ఎన్నో రకాల వార్తల వస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15, 2020న ధోని తన ట్విటర్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అతని అభిమానులను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేశాడు...

Tags :
|
|

Advertisement