Advertisement

  • హెడ్ ఫోన్ పెట్టుకొని రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో దుర్మరణం

హెడ్ ఫోన్ పెట్టుకొని రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో దుర్మరణం

By: chandrasekar Mon, 28 Sept 2020 4:10 PM

హెడ్ ఫోన్ పెట్టుకొని రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో దుర్మరణం


హెడ్ ఫోన్ పెట్టుకొని రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడే దుర్మరణం పాలయ్యాడు. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ రైలును ఢీకొన్న దుర్టటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈఘటనలో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి దుర్మరణం పాలైయ్యాడు. రైలును గమనించక పోవడంతో దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అధికంగా వాడకంతో జనాలు జరిగే విషయాలు గుర్తించక మృతువాత పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో రైల్వే ట్రాక్ పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రాయికల్ బురుజు గడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్ డబల్ లైన్ రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతూ నిలుచున్నాడు.

అప్పుడు పాత రైల్వే ట్రాక్ పై రైలు వస్తుందనే భావనతో కొత్త రైల్వే ట్రాక్ పై నిలుచుని ఫోన్ మాట్లాడుతున్నాడు. చెవిలో హెడ్ ఫోన్స్ ఉండడంతో రైలు వచ్చే శబ్దం వినిపించలేదు. దీంతో రైలు దగ్గరకు వచ్చినా కూడా రాంసింగ్‌ చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండటంతో రైలు వస్తున్న శబ్ధం వినిపించలేదు.

హెడ్ ఫోన్ వల్ల శబ్దం పూర్తిగా వినబడక పోవడంతో రైలు సమీపించి రాంసింగ్ ను ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే రాంసింగ్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పబ్లిక్ ప్లేస్ లలో ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పదే పదే సూచనలు చేస్తున్న ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం చాలా బాధాకరం.

Tags :
|

Advertisement