Advertisement

  • నా త‌ర్వాతి పుట్టిన రోజు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో‌: క‌మ‌ల్

నా త‌ర్వాతి పుట్టిన రోజు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో‌: క‌మ‌ల్

By: chandrasekar Tue, 10 Nov 2020 8:45 PM

నా త‌ర్వాతి పుట్టిన రోజు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో‌: క‌మ‌ల్


రీసెంట్‌గా త‌న 66వ బ‌ర్త్‌డే ని లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఆయ‌న‌కు సినీ, రాజకీయ‌, క్రీడా ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. చెన్నైకు చెందిన అభిమానులు స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్ళి క‌మ‌ల్‌కు ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వారిని ప్రేమ‌గా ప‌ల‌క‌రించారు విశ్వ న‌టుడు. అయితే క‌మ‌ల్ హాస‌న్ త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ట్విట్ట‌ర్‌లో నాకు విషెస్ అందించిన అభిమానుల‌కు, సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రికి ధ‌న్య‌వాదాలు. మీ అంద‌రి దీవెన‌లు నా పుట్టిన రోజును చాలా ప్ర‌త్యేకంగా మార్చాయి. నా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన మ‌క్క‌ల్ నీది మయ్యం కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్యావాదాలు. మీ క‌ష్టానికి, ప్రేమ‌కు త‌గ్గ ఫ‌లితం ద‌క్కేలా నేను క‌ష్ట‌ప‌డ‌తా. నా త‌ర్వాతి పుట్టిన రోజును ఫోర్ట్ సెయింట్ జార్జ్ (తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం)లో జరుపుకుందామ`ని కమల్ ట్వీట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Tags :
|
|

Advertisement