Advertisement

  • ఐపీయల్ స్పాన్సర్‌ గా వివో కొనసాగడంపై తీవ్ర విమర్శలు చేసిన ఒమర్ అబ్దుల్లా

ఐపీయల్ స్పాన్సర్‌ గా వివో కొనసాగడంపై తీవ్ర విమర్శలు చేసిన ఒమర్ అబ్దుల్లా

By: Sankar Mon, 03 Aug 2020 4:53 PM

ఐపీయల్ స్పాన్సర్‌ గా వివో కొనసాగడంపై తీవ్ర విమర్శలు చేసిన ఒమర్ అబ్దుల్లా



పొరుగు దేశం చైనా లడఖ్‌లో చొరబడిన నేపథ్యంలో ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుండగా ఐపీఎల్‌ తన స్పాన్సర్‌లందరినీ నిలుపుకోవడానికి అనుమతించబడిందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. "చైనీస్ సెల్‌ఫోన్ తయారీదారులు ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌లుగా కొనసాగుతారు. మరోవైపు చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించమని ప్రజలు చెబుతున్నారు.’’ అని అబ్దుల్లా ట్వీట్‌చేశారు.

చైనా మొబైల్ కంపెనీ వివోతో సహా తన స్పాన్సర్లందరినీ నిలుపుకోవాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలి నిర్ణయం గురించి వచ్చిన వార్తలపై మాజీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి స్పందించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఐపీఎల్‌ జరుగనుంది.

"పెద్ద పెద్ద చైనీస్‌ సంస్థలతో సహా అన్ని స్పాన్సర్‌లను నిలుపుకోవాలని బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి నిర్ణయించింది. తమ బాల్కనీల నుంచి చైనా టీవీలను విసిరిన ఇడియట్స్‌కు ఇది చెడుగా అనిపిస్తుంది.’’ అని అబ్దుల్లా రాసుకొచ్చారు

Tags :
|
|
|

Advertisement