Advertisement

  • వేలాదిమంది వలస కార్మికులకు ఊరట కలిగించిన ఒమన్ ప్రభుత్వం

వేలాదిమంది వలస కార్మికులకు ఊరట కలిగించిన ఒమన్ ప్రభుత్వం

By: Sankar Mon, 30 Nov 2020 7:08 PM

వేలాదిమంది వలస కార్మికులకు ఊరట కలిగించిన ఒమన్ ప్రభుత్వం


ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది.

వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్‌ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. కాగా ఒమన్‌ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు

Tags :
|

Advertisement