Advertisement

  • రూ.2400 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో OLA ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ

రూ.2400 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో OLA ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ

By: chandrasekar Tue, 15 Dec 2020 10:31 AM

రూ.2400 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో OLA ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ


దేశంలో క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ప్రముఖ క్యాబ్ సంస్థ OLA తమిళనాడులో ఈ-స్కూటర్ ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇక్కడ తయారు చేయబడే ఈ-స్కూటర్లను ఎగుమతి చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని ఓలా సంస్థ తమిళనాడులో ప్రారంభించనుంది.

ఇందుకోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తమిళనాడులో నెలకొల్పనున్న ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ వల్ల రాష్ట్రంలో 10 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు కలగ నున్నట్లు తెలిపింది. ఈ ఫ్యాక్టరీలో సంవత్సరానికి 20 లక్షల స్కూటర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో స్థాపించనున్నారు.

ఇందుకోసం రూ.2400 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్టు తెలిపింది. తాము తయారు చేసిన ఈ-స్కూటర్లను వచ్చే సంవత్సరం 2021 జనవరి నెలలో మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. తమిళనాడులో తయారుచేయబడ్డ ఈ-స్కూటర్లను లాటిన్ అమెరికాకు, యూరోప్ కు మరియు ఆసియా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే తమిళనాడు రాష్ట్రం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హబ్ గా గుర్తించబడిన విషయం అందరికి తెలిసిందే.

Tags :
|

Advertisement