Advertisement

  • పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామంటున్న అధికారులు

పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామంటున్న అధికారులు

By: chandrasekar Sat, 18 July 2020 5:07 PM

పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామంటున్న అధికారులు


శ్రావణ మాసంలో పెళ్లిళ్లు చేయాలనుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో పెళ్లిళ్లకు అతిధులు ఆశించిన స్థాయిలో వచ్చేది కూడా అనుమానమే. ఇదే సమయంలో అసలు పెళ్లిళ్లకు ఎంతమంది అతిథులను అనుమతించాలనే అంశంపై ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ జిల్లా కలెక్టరేట్‌ నుంచి కార్యక్రమాలకు అనుమతి పొందాల్సి వచ్చేది. దీనివల్ల జాప్యం అవుతోంది. దీంతో మండల పరిధిలో తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈనెల 21వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించుకోవడానికి బంధువులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌ కింది స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మిగతా శుభకార్యాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే తహసీల్దార్‌ అనుమతి ఇవ్వనున్నారు.పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడికి సంబంధించి ఇరువైపులా కలిపి 20 మంది మాత్రమే అనుమతించబడతారు.

వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్‌ కార్డులతోపాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చినపత్రాలను జత చేయాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌–188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు.

Tags :
|

Advertisement