Advertisement

  • వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు ..అధికారులను అలెర్ట్ చేసిన సీఎం కెసిఆర్

వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు ..అధికారులను అలెర్ట్ చేసిన సీఎం కెసిఆర్

By: Sankar Sun, 11 Oct 2020 4:49 PM

వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు ..అధికారులను అలెర్ట్ చేసిన సీఎం కెసిఆర్


రానున్న రెండురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయని, సోమ, మంగళవారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని గుర్తుచేశారు. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షించి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులంతా స్థానికంగా అందుబాటులో ఉండి పరిస్థితిని గమనించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

చాలా చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని ఫలితంగా కొన్నిచోట్ల చెరువులకు గండ్లుపడే అవకాశం ఉందని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నంకావచ్చని సీఎం చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు.

Tags :
|

Advertisement