Advertisement

  • ఆస్ట్రేలియా, జింబాబ్వేల మధ్య ఆగస్టులో జరగాల్సిన వన్డే సిరీస్‌ కరోనా వైరస్ కారణంగా వాయిదా

ఆస్ట్రేలియా, జింబాబ్వేల మధ్య ఆగస్టులో జరగాల్సిన వన్డే సిరీస్‌ కరోనా వైరస్ కారణంగా వాయిదా

By: chandrasekar Wed, 01 July 2020 8:06 PM

ఆస్ట్రేలియా, జింబాబ్వేల మధ్య ఆగస్టులో జరగాల్సిన వన్డే సిరీస్‌ కరోనా వైరస్ కారణంగా వాయిదా


కరోనా కారణంగా చాల క్రికెట్ పోటీలు ఆగిపోయాయి. ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య ఆగస్టులో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. గత కొద్దిరోజుల నుంచి ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో సిరీస్‌ని అక్కడ నిర్వహించడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తేల్చేసింది. జింబాబ్వే జట్టు 2003-04లో చివరిగా ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడింది.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఈ సిరీస్ జరగాల్సి ఉండగా ఆస్ట్రేలియాలో ఇప్పటికే 7,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 104 మంది చనిపోయారు. దాంతో జింబాబ్వే క్రికెట్ బోర్డుతో మాట్లాడి పరస్పర అంగీకారంతోనే ఈ వన్డే సిరీస్‌ని వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

అదేవిధంగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని కూడా వాయిదా వేసే దిశగా ఐసీసీ యోచిస్తోంది. ఆస్ట్రేలియాలో సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై నిషేధం ఉండటంతో జింబాబ్వే జట్టు ఆ దేశంలో అడుగుపెట్టే సూచనలు ఏమాత్రం కనిపించలేదు. దానికి తోడు అక్కడికి వెళ్లిన వెంటనే జింబాబ్వే టీమ్ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. దాంతో పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సిరీస్‌ని నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హామీ ఇచ్చినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు వెల్లడించింది.

Tags :
|
|

Advertisement