Advertisement

  • ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులకు వైరస్ ప్రభావం తక్కువ అని తేలిందట

‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులకు వైరస్ ప్రభావం తక్కువ అని తేలిందట

By: chandrasekar Fri, 12 June 2020 7:16 PM

‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులకు వైరస్ ప్రభావం తక్కువ అని తేలిందట


చైనాలో సోకిన కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తోంది. ఈ మయదారి రోగం దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ అమల్లోకి ఉన్నప్పటికీ దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మరి ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచమంతటా తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పట్లో కరోనా కట్టడి సాధ్యమేనా అనే ప్రశ్న అందరికి తలెత్తుతోంది. కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే వైరస్ ఒక్కో దేశంలో ఒక్కోలా రూపాంతరం చెందుతుందటంతో వ్యాక్సిన్ కనుగోనడం కష్టతరంగా మారుతోంది. దీంతో ఎప్పటిలోగా కరోనా వ్యాక్సిన్ వస్తుందనే చెప్పడం ప్రశ్నార్థకంగా మారింది. అయితే కరోనా వైరస్ బారిన పడిన వారి నుంచి పెద్దఎత్తున శాంపిళ్లను సేకరించి 23అండ్ మీ అనే జెనెటిక్ టెస్టింగ్ సంస్థ అధ్యయనం చేపట్టింది. వీరి అధ్యయనంలో అందరిలో ఒకే లక్షణాలు కన్పించడం లేదని తేలింది. కరోనా వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తూ రూపాంతరం చెందుతుందని ప్రకటించారు.

వీరి అధ్యయనంలో మరో విషయం వెల్లడైంది. ప్రిలిమినరీ ఫలితాలను పరిశీలించినట్లయితే ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు వైరస్ బారిన తక్కువగా పడుతున్నారని తేలిందట. మిగతా గ్రూప్ బ్లడ్ శాంపిళ్లతో పోలిస్తే టైప్ ‘ఓ’ గ్రూప్ బ్లడ్ వ్యక్తులు 9 నుంచి 18శాతం వరకు మాత్రమే వైరస్ ప్రభావానికి గురవుతున్నట్లు తేలిందట.

అదేవిధంగా టైప్ ‘ఏ’ గ్రూప్ బ్లడ్ కలిగినవారు ఎక్కువగా వైరస్ బారిన పడినట్లు వారి అధ్యయనంలో వెల్లడైందట. దాదాపు 8లక్షలమందిపై ఈ సంస్థ అధ్యాయనం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ సంస్థ స్పష్టమైన ఆధారాలను మాత్రం ప్రకటించలేదు.

Tags :
|

Advertisement