Advertisement

  • కరోనా వైరస్ అంటించాడని డాక్టర్ పై నర్సు కోర్టులో పిటిషన్

కరోనా వైరస్ అంటించాడని డాక్టర్ పై నర్సు కోర్టులో పిటిషన్

By: chandrasekar Mon, 26 Oct 2020 1:07 PM

కరోనా వైరస్ అంటించాడని డాక్టర్ పై నర్సు కోర్టులో పిటిషన్


కరోనా వైరస్ అంటించాడని డాక్టర్ పై నర్సు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓ డాక్టర్ తనకు కావాలనే కరోనా వైరస్ అంటించాడని ఓ నర్సు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్స్ లేవని అడిగినందుకు అతడు ఈ విధంగా చేశాడని నర్సు తెలిపింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లొరిడా‌లో చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే వెనిస్ జీన్ బాప్టిస్ట్ అనే నర్సు తన యజమాని డాక్టర్ జోసెఫ్ పిపెరాటోపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డాక్టర్ మార్చి నెలలో మియామి బీచ్‌లో జరిగిన డ్యాన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యాడని ఆ తర్వాత కొద్ది రోజులకు అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అంతకు ముందు ఆస్పత్రిలో పీపీఈ కిట్లు లేవని చెబితే డాక్టర్ పట్టించుకోలేదు. మా దగ్గర ఉన్న అందరు పెషేంట్లకు అవసరమైన N95 మాస్క్‌లు కూడా లేవు.

పేషెంట్స్ విసిటింగ్ లో భాగంగా డాక్టర్‌తో కలిసి హాల్‌లో నడుస్తున్నప్పుడు కరోనా టెస్ట్ చేయించుకోమని కోరాను. అయితే డాక్టర్ అప్పుడు నావైపు తిరిగి దగ్గాడు. ఇప్పుడు నాకు కరోనా ఉంటే నీకు కూడా వచ్చేస్తోంది అన్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే నాకు, నా రెండేళ్ల కొడుకుకు కరోనా లక్షణాలు వచ్చాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టుగా తేలింది. రెండు వారాల పాటు కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో తాము నరకం అనుభవించాం అని నర్సు తెలిపింది. ఇక, ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తనకు జరిగిన నష్టానికి డాక్టర్ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. ఇక, వైద్య సామాగ్రి, సాయం అందించడంలో తాము సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ నిబంధనలు పాటించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నర్సు చేసిన ఆరోపణలను ఖండించాయి.

Tags :
|
|
|

Advertisement