Advertisement

నీట్ అడ్మిట్ కార్డ్ విడుదల

By: Sankar Wed, 26 Aug 2020 2:33 PM

నీట్ అడ్మిట్ కార్డ్  విడుదల


సెప్టెంబర్‌ 13న నిర్వహించనున్న నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌ 2020)కి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల చేసింది.

ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ 2020 కి సంబంధించిన అడ్మిట్‌కార్డులను కూడా ఎన్‌టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష‌ సెప్టెంబరు 13న నిర్వహించనుంది. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు పరీక్షలు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యతిరేకత మధ్యనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జేఈఈ, నీట్‌ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్‌టీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది

Tags :
|
|

Advertisement