Advertisement

  • కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీర్‌గా పాల్గొన్న ఎన్ఆర్ఐ

కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీర్‌గా పాల్గొన్న ఎన్ఆర్ఐ

By: chandrasekar Thu, 23 July 2020 11:33 AM

కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీర్‌గా పాల్గొన్న ఎన్ఆర్ఐ


యూకే కరోనా వ్యాక్సిన్ త‌యారీలో మేజ‌ర్ ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా దాటిన సంగ‌తి అందరికి తెలిసిందే. ఎన్ఆర్ఐ దీపక్ పాలివాల్(42) యూకేలో ఫార్మా కన్సల్టెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. అతనే స్వయంగా ఆక్స్ ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయంలో చేప‌ట్టిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీర్‌గా సైన్ చేశాడు.

ఆ స‌మ‌యంలో అతనికి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. త‌న నిర్ణయంపై భార్యతో సహా కుటుంబ స‌భ్యులు ఆందోళన వ్య‌క్తం చేశారు.

అయితే ఈ మహమ్మారితో పోరాడటానికి ప్రపంచానికి త‌న వంతు స‌హాయం చేయ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

ఇది నా ప్రాణాలను పణంగా పెట్ట‌డ‌మేన‌ని త‌న‌కు తెలుస‌న్నారు. కాగా ఒక రోజు అనంత‌రం టీకా వాలంటీర్లలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసిందన్నారు.

వాక్సిన్ ట్ర‌య‌ల్స్ లో తన సహకారం అదేవిధంగా త‌న భార్య స‌హ‌కారం గురించి గర్వపడుతున్నానని పాలివాల్ పేర్కొన్నారు. ఫేజ్‌-2 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొన్న వెయ్యి మందిలో దీప‌క్ పాలివాల్ ఒకే ఒక్క ఎన్ఆర్ఐ‌.

Tags :
|

Advertisement