Advertisement

  • యూఎస్ ఓపెన్ నుంచి డిస్ క్వాలిఫై అయిన జొకోవిచ్

యూఎస్ ఓపెన్ నుంచి డిస్ క్వాలిఫై అయిన జొకోవిచ్

By: Sankar Mon, 07 Sept 2020 09:04 AM

యూఎస్ ఓపెన్ నుంచి డిస్ క్వాలిఫై అయిన జొకోవిచ్


యూఎస్‌ ఓపెన్‌ నుంచి జొకోవిచ్‌ డిఫాల్ట్‌ అయ్యాడు. అనుకోకుండా అతను కొట్టిన బంతి లైన్‌ జడ్జి మెడకు తాకడంతో టోర్నీ నుంచి అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆదివారం ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తన ప్రత్యర్థి పాబ్లో కారెనో బస్టా చేతిలో మొదటి సెట్లో 6-5తో వెనుకబడిపోయాడు.

ఛేంజ్‌ ఓవర్‌ కోసం అతను పక్కకు వెళుతూ.. బంతిని వెనుకకు కొట్టాడు. అది వెళ్లి లైన్ జడ్జి మెడకు తాకడంతో నొప్పిని భరించలేక కిందపడిపోయింది. టోర్నమెంట్ రిఫరీ సోరెన్ ఫ్రైమెల్‌తో సహా కోర్టులో అధికారులతో చర్చించి, చైర్ అంపైర్ అరేలీ టూర్టే జకోవిచ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టకపోయినా.. నిబంధనల ప్రకారం గతంలో జరిగిన ఘటనలను పరిగణలోకి తీసుకొని టోర్నీ నుంచి తొలగించారు.

2017లో డేవిస్‌ కప్‌లో డెనిస్‌ షాపోవాలోవ్‌ కొట్టిన బంతి చైర్‌ అంపైర్‌ ముఖాన్ని తాకడంతో డిఫాల్ట్‌ అయ్యాడు. 1995లో వింబుల్డన్‌లో టీమ్‌ హెన్మాన్‌ బంతిని బాల్‌ గర్ల్‌ తలపై కొట్టడంతో భాగస్వామి జెరెమీ బేట్స్‌తో డబుల్స్ మ్యాచ్‌తో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Tags :
|

Advertisement