Advertisement

  • పాత జోన్ల ప్రకారమే తెలంగాణాలో ఉద్యోగ నియామకాలు ..

పాత జోన్ల ప్రకారమే తెలంగాణాలో ఉద్యోగ నియామకాలు ..

By: Sankar Mon, 21 Dec 2020 12:33 PM

పాత జోన్ల ప్రకారమే తెలంగాణాలో ఉద్యోగ నియామకాలు ..


తెలంగాణాలో ఉద్యోగ నియామకాలను శరవేగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేసేందుకు సన్నద్ధమైంది.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా నియామకాలు చేపట్టేందుకు వీలుగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నది. రెండుజోన్లు, 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పాత జోనల్‌ విధానంలోనే నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

కొత్తగా ఉనికిలోకి వచ్చిన జోనల్‌ వ్యవస్థలో సవరణలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైల్‌ పంపింది. ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఇక ఎలాంటి వివాదాలకు తావులేకుండా నియామకాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. అన్నిశాఖల కార్యదర్శులు, జీఏడీ అధికారులతో పలుసార్లు భేటీ అయ్యారు. ఖాళీలు, ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివరాలతోపాటు నియామకాలు ఎలా చేపట్టాలన్నదానిపై చర్చించారు...

Tags :

Advertisement