Advertisement

  • పతాంజలి సంస్థ కరోనా మందు కరోనిల్ విడుదలపై అనుమతి గురించి నోటీస్

పతాంజలి సంస్థ కరోనా మందు కరోనిల్ విడుదలపై అనుమతి గురించి నోటీస్

By: chandrasekar Sat, 27 June 2020 6:20 PM

పతాంజలి సంస్థ కరోనా మందు కరోనిల్ విడుదలపై అనుమతి గురించి నోటీస్


రాందేవ్ బాబా యొక్క పతాంజలి సంస్థ కరోనా మందు కరోనిల్ విడుదల చేయగానే ఐసీఎమ్‌ఆర్, ఆయుష్ మంత్రిత్వ శాఖ వెంటనే ఆ మందుని ప్రమోట్ చేయడం ఆపేయమని, వారు చెబుతున్న దాన్ని ధృవీకరించమనీ అడిగారు. పతాంజలిని క్లినికల్ ట్రయల్స్ గురించి స్పష్టత ఇవ్వమని అడిగారు. దీంతో ఆ సంస్థ సీయీవో ప్రకటన విడుదల చేశారు. రాండమైజ్డ్ ప్లెసీబో-కంట్రోల్డ్ ట్రయల్స్ ప్రమాణాలకి కంపెనీ కట్టుబడి ఉందనీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కరోనా మహమ్మారి కొవిడ్ కి మందుగా పతంజలి చెప్తున్న కొరోనిల్ యొక్క వివరాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ విషయం గురించి పూర్తిగా విచారణ జరుపుతామనీ, ఆ తరువాతే కంపెనీ ఆ ఉత్పత్తి గురించి ప్రచారం చేసుకోవచ్చనీ ఆ శాఖ తెలిపింది. ఆ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో, ఆయుర్వేద మందులతో పాటు ఇలాంటి మందుల ప్రచారాలు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అబ్జెక్షనబుల్ ఎడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్ 1954 మరియు కొవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్దేశకాల నియంత్రణలో ఉంటాయని ఆ సంబంధిత డ్రగ్ కంపెనీకి తెలిపామని వారు అన్నారు.

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ వారి ద్వారా కొవిడ్-19 చికిత్స కోసం డెవలప్ చేసిన ఆయుర్వేద మందు వివరాలు మీడియాలో రావడం పై ఆయుష్ మంత్రిత్వ శాఖ విచారణ చేపడుతుంది. అధ్యయన వివరాలు కానీ, వారు చెప్తున్న దానిలో ఉన్న వాస్తవాలు కానీ ఆయుష్ మంత్రిత్వ శాఖ కు తెలియదు అని అందులో ఉంది. పతాంజలి కొరోనిల్‌కి ఇమ్యూనిటీ బూస్టర్‌గా, దగ్గు, జలుబుకి మందుగా అప్రూవల్ ఉందని లైసెన్సింగ్ అధికారి తెలిపారు. కొవిడ్-19 కిట్ తయారు చేయడానికి వారికి ఉన్న అనుమతి గురించి వారికి నోటీస్ జారీ చేస్తామని కూడా ఆ అధికారి తెలిపారు.

Tags :

Advertisement