Advertisement

  • కరోనా వచ్చిన వ్యక్తి ఇంట్లో ఉన్న కూడా ఇంట్లో అందరికి కరోనా సోకదు .. ఐఐపీహెచ్‌ అధ్యయనం

కరోనా వచ్చిన వ్యక్తి ఇంట్లో ఉన్న కూడా ఇంట్లో అందరికి కరోనా సోకదు .. ఐఐపీహెచ్‌ అధ్యయనం

By: Sankar Tue, 04 Aug 2020 1:53 PM

కరోనా వచ్చిన వ్యక్తి ఇంట్లో ఉన్న కూడా ఇంట్లో అందరికి కరోనా సోకదు .. ఐఐపీహెచ్‌ అధ్యయనం



కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్‌ సోకుతుం దని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% సభ్యులకు ఆ వైరస్‌ సోకకపోవచ్చని తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్‌ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని గుజరాత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో స్పష్టమైంది.

‘వైరస్‌ సోకిన వ్యక్తిని కలిసిన అందరికీ అది సోకుతుందని చెప్పలేం. అదే నిజమైతే, కోవిడ్‌–19 నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికీ ఆ వైరస్‌ సోకాలి కదా?. కానీ అలా జరగడం లేదు. కోవిడ్‌–19తో చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబాల్లో కూడా ఎవరికీ ఆ వైరస్‌ అంటుకోని ఉదాహరణలున్నాయి’అని ఆ సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌ మవలాంకర్‌ వివరించారు.

కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశాలపై అం తర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. అహ్మదాబాద్‌లో కేసు ల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత ఒక్కసారిగా తగ్గాయని, అందుకు కారణం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమే కావ చ్చని వివరించారు. యూనివర్సిటీ కా లేజ్‌ ఆఫ్‌ లండన్‌ న్యూరో సైంటిస్ట్‌ కార్ల్‌ ఫ్రిస్టన్‌ ప్రతిపాదిం చిన ‘ఇమ్యూనలాజికల్‌ బ్లాక్‌ హోల్‌’సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి వైరస్‌ సోకదని వివరించారు. ఇమ్యూనిటీ, ఇళ్లకే పరిమితమవడం.. మొదలైనవి అందుకు కారణాలన్నారు.

Tags :
|
|
|
|

Advertisement