Advertisement

  • హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదు

హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదు

By: chandrasekar Mon, 23 Nov 2020 3:47 PM

హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదు


హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదు అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌ వరదలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులెందుకు ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పరిధిలోని భారతీనగర్‌ డివిజన్‌-111, రామచంద్రాపురం డివిజన్‌ 112, పటాన్‌చెరు డివిజన్‌ 113లో మంత్రి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం, రామచంద్రాపురం, భారతీనగర్‌లో రోడ్‌షోలు నిర్వహించారు. మూడు డివిజన్లకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు పటాన్‌చెరులో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కార్యాలయాల్లో కుర్చీలు గాలిలోకి ఎగురుతున్నాయన్నారు. లుంగీలు, లాగులు చినుగుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుల్లోనే సయోధ్యలేదని, ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రజలు ఆత్మవిశ్వాసంతో, భద్రతతో జీవిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ గెలువాలన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని చెప్పారు. తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ నరేంద్ర మోదీ ఇక్కడి ప్రజలను అవమానించారని గుర్తుచేశారు. 14వ ఆర్థికసంఘం నుంచి నిధులు రాలేదని చెప్పారు. బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌ పరిశ్రమల సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదన్నారు. మీడియా సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీ భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కే సత్యనారాయణ, చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బెంగళూర్‌లో వరదలు వస్తే రూ.600 కోట్లు, గుజరాత్‌లో వరదలు వస్తే రూ. 500 కోట్లు కేటాయిస్తే, హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరద బాధితులకు సాయం చేస్తుంటే బీజేపీ నేతల అడ్డుకున్నారు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Advertisement