Advertisement

  • తెలంగాణాలో ప్రారంభమైన నాన్ అగ్రికల్చరల్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

తెలంగాణాలో ప్రారంభమైన నాన్ అగ్రికల్చరల్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

By: chandrasekar Mon, 14 Dec 2020 3:43 PM

తెలంగాణాలో ప్రారంభమైన నాన్ అగ్రికల్చరల్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు


తెలంగాణలో నాన్న అగ్రికల్చరల్ ఆస్తులు ఇల్లు స్థలాలు ప్లాట్ల భూములు రిజిస్ట్రేషన్లు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల అనంతరం ఈ ప్రక్రియ కొనసాగనుంది తెలుస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో నాన్ అగ్రికల్చరల్ కోసం వున్న లింకు ఓపెన్ కావడం లేదు. హైకోర్టు దీనికోసం నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పాత విధానంలోనే చేపట్టాలని తెలియజేసింది.

తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ చర్చలో నాన్ అగ్రికల్చరల్ ఆస్తులను రిజిస్టర్ చేయుటకు దీనికి సంబంధించిన లింకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లకు ఈరోజు ఉదయం అందించనున్నట్లు తెలిపారు. నాన్నా అగ్రికల్చరల్ ఆస్తులకు స్లాట్ బుకింగ్ ప్రక్రియలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించిన 15 నిమిషాల్లోనే రెండు స్లాట్ బుక్ చేయబడ్డాయి. శుక్రవారం రాత్రి 7 గంటల వరకూ మొత్తంగా 37 స్లాట్ బుక్స్ చేయబడ్డాయి.

సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఉద్యోగులకు రెండవ శనివారం మరియు ఆదివారం కూడా సెలవును రద్దు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియలో నాన్ అగ్రికల్చరల్ రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ప్రజలు ఆస్తులు వివరాలు పారదర్శకంగా ఉంటుందని మరియు ఇందువల్ల ఒకరి ఆస్తిని మరొకరికి అమ్మడానికి వీలుకాదని తెలుస్తుంది.

Tags :
|
|

Advertisement