Advertisement

  • నోకియా నుంచి ప్యూర్‌బుక్ పేరుతో ల్యాప్‌టాప్ సిరీస్

నోకియా నుంచి ప్యూర్‌బుక్ పేరుతో ల్యాప్‌టాప్ సిరీస్

By: Sankar Wed, 09 Dec 2020 7:49 PM

నోకియా నుంచి ప్యూర్‌బుక్ పేరుతో ల్యాప్‌టాప్ సిరీస్


ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే అందరికి గుర్తొచ్చేది నోకియా బ్రాండ్ ..మొబైల్ ఫోన్ల మార్కెట్ లో నోకియా ఒక విప్లవమే సృష్టించింది..అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా నోకియా మొబైల్ ఫోన్ ల విభాగంలో తన ప్రభావం కోల్పోతూ వస్తుంది...ఇక నోకియా ఇటీవల కాలంలో ఇటీవల స్మార్ట్‌టీవీ విభాగంలోకి ప్రవేశించింది

ఇక త్వరలో భారత్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ సిరీస్‌ను లాంచ్‌ చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్తగా డిజైన్‌ చేసిన ల్యాప్‌టాప్‌కు నోకియా ప్యూర్‌బుక్‌ అని పేరు పెట్టారు. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో రాబోయే నోకియా ప్యూర్‌బుక్ ల్యాప్‌టాప్ సిరీస్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది.

‘అల్ట్రాలైట్’, ‘పవర్‌ఫుల్’, ‘ఇమ్మర్సివ్’ వంటి ఫీచర్లు ల్యాప్‌టాప్‌లో ఉన్నాయని తెలియజేసే పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు, విడుదల తేదీ, ధరకు తదితర వివరాలను ఇంకా వెల్లడించలేదు. టెన్త్‌ జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌-ఐ సిరీస్‌ ప్రాసెసర్లు ఇందులో ఉండనున్నట్లు తెలిసింది.

Tags :
|

Advertisement