Advertisement

మనదేశంలో ఈరోజు నోకియా 5.3 సేల్ ప్రారంభం

By: chandrasekar Tue, 01 Sept 2020 6:46 PM

మనదేశంలో ఈరోజు నోకియా 5.3 సేల్ ప్రారంభం


నోకియా బడ్జెట్ ఫోన్ నోకియా 5.3 సేల్ మనదేశంలో ఈరోజు లాంచ్ అయినది. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం అయింది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ను దీనిలో అందించారు. దీని స్క్రీన్ సైజు 6.55 అంగుళాలుగా ఉంది.

నోకియా 5.3 ధర

దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా ఉంది. స్యాన్, శాండ్, చార్ కోల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు

ఇందులో 6.55 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు.

దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీగా ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

దీనిలో వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.

Tags :
|
|
|

Advertisement