Advertisement

  • నోయిడాలో సంచలనం ..డయల్ 100 కి ఫోన్ చేసి ప్రధాని మోడీకి బెదిరింపులు

నోయిడాలో సంచలనం ..డయల్ 100 కి ఫోన్ చేసి ప్రధాని మోడీకి బెదిరింపులు

By: Sankar Tue, 11 Aug 2020 6:10 PM

నోయిడాలో సంచలనం ..డయల్ 100 కి ఫోన్ చేసి ప్రధాని మోడీకి బెదిరింపులు



కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అక్కడ బాంబు ఉంది , ఇక్కడ బాంబు ఉంది లేకపోతే పోలీసులు అక్కడికి రావాలి , ఇక్కడికి రావాలి అని ఫోన్ చేసే ఆకతాయిలను మనం రోజు చూస్తూనే ఉంటాము..అయితే ఏకంగా ప్రధాన మంత్రికే బెదిరింపులు ఇవ్వడం మాత్రం ఇంతవరకు చూసి ఉండము..కానీ ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా లో ఈ సంఘటన జరిగింది.డయల్ 100కి ఫోన్ చేసి ప్రధాన మంత్రికి హాని తలపెడతాము అంటూ బెదిరించారు .. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు

హర్యానా రాష్ట్రానికి చెందిన హర్‌భజన్ సింగ్ నోయిడా నగరంలో నివాసముంటున్నారు. సింగ్ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. సోమవారం హర్‌భజన్ సింగ్ 100 పోలీసు ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీకే హాని తలపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోయిడా ఫేజ్ 3 పోలీసులు నిందితుడైన హర్‌భజన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతడ్ని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు

ప్రధానిని బెదిరించిన హర్‌భజన్ సింగ్ డ్రగ్ ఎడిక్టు అని, అతన్ని ప్రశ్నించి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామని నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీని ఫోన్ లో బెదిరించిన యువకుడి ఘటన నోయిడాలో సంచలనం రేపింది. డ్రగ్స్‌కు బానిసన హర్భజన్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. అందుకే అతడు ఆ విధంగా ఫోన్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రశ్నించే క్రమంలో సింగ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ తెలియజేశారు.

Tags :
|
|
|
|
|
|
|
|

Advertisement