Advertisement

శీతాకాల సమావేశాలు రద్దు...ఎందుకో తెలుసా !

By: Sankar Tue, 15 Dec 2020 4:47 PM

శీతాకాల సమావేశాలు రద్దు...ఎందుకో తెలుసా !


కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కరోనా ప్రకంపనలు రేపిన నేపథ్యంతోపాటు, దేశంలో ఇంకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించ నున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై వివరణ ఇచ్చారు.

ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.

Tags :
|

Advertisement