Advertisement

  • సిలిండర్ బుకింగ్ కోసం ఎక్కువ కష్టపడవలసి అవసరం లేదు

సిలిండర్ బుకింగ్ కోసం ఎక్కువ కష్టపడవలసి అవసరం లేదు

By: chandrasekar Thu, 28 May 2020 3:09 PM

సిలిండర్ బుకింగ్ కోసం ఎక్కువ కష్టపడవలసి అవసరం లేదు


మీ ఫోన్‌లో వాట్సప్ ఉంటే చాలు. ఈజీగా సిలిండర్ బుక్ చేయొచ్చు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది.ఇంట్లో సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్. ఇక మీరు సిలిండర్ బుక్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు.

దేశంలోని భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ ఇక వాట్సప్ ద్వారా సులువుగా సిలిండర్ బుక్ చేయొచ్చు. భారత్ గ్యాస్‌ కస్టమర్ల సంఖ్య 7.1 కోట్లు. ఇండియన్ ఆయిల్ తర్వాత భారత్ గ్యాస్‌కు ఎక్కువ మంది ఎల్‌పీజీ కస్టమర్లు ఉన్నారు. ఈ కస్టమర్లు వాట్సప్ నుంచి సిలిండర్ బుక్ చేయడానికి బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించారు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800224344 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది. వాట్సప్ ద్వారా ఎల్‌పీజీ బుక్ చేయడం కస్టమర్లకు చాలా సులువు. పిల్లల నుంచి పెద్దల వరకు వాట్సప్ సాధారణంగా ఉపయోగించే యాప్‌గా మారిపోవడంతో, ఈ విధంగా సిలిండర్ బుక్ చేసే సదుపాయాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నాం.

no,need,push,too hard,cylinder booking ,సిలిండర్, బుకింగ్, ఎక్కువ, కష్టపడవలసి, అవసరం లేదు


కస్టమర్లు వాట్సప్ ద్వారా భారత్ గ్యాస్ బుక్ చేయడానికి ముందుగా బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ 1800224344 సేవ్ చేసుకోవాలి. మొదట Hi అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత Book లేదా 1 అని మెసేజ్ చేయాలి. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్‌లో పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇతర వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. కేవలం సిలిండర్ బుక్ చేయడం మాత్రమే కాదు డెలివరీ ట్రాకింగ్, ఫీడ్‌బ్యాక్ లాంటి సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇప్పటికే ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, యాప్స్, వెబ్‌సైట్ ద్వారా సిలిండర్ బుక్ చేసే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.

Tags :
|
|
|

Advertisement