Advertisement

  • తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలకు తావు లేదు: అన్నాడీఎంకే

తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలకు తావు లేదు: అన్నాడీఎంకే

By: chandrasekar Mon, 09 Nov 2020 6:48 PM

తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలకు తావు లేదు: అన్నాడీఎంకే


రాబోయే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో సంకీర్ణం కోసం చర్చలు జరిపే అవకాశాన్ని తమిళనాడులో పాలక అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఏఐఏడీఎంకే) ఆదివారం కొట్టిపారేసింది. ఇలాంటి ఫార్ములాను ప్రజలు తిరస్కరిస్తారని పార్టీ నొక్కి చెప్పింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో సంపూర్ణ మెజారిటీతో పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి డీ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ విశ్వాసం వ్యక్తం చేశారు.

"తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలకు తావు లేదు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు నిర్ణయాత్మక ఆదేశం లభిస్తుంది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది" అని మంత్రి డీ జయకుమార్‌ చెప్పారు. 2021 ఎన్నికలలో మా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండేలా ప్రజలు నిర్ణయించారని, మేము చరిత్రను తిరగరాస్తామని జయకుమార్ అన్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ కోరిక వ్యక్తం చేసిన కొద్ది గంటలకే ఏఐఏడీఎంకే మంత్రి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళనాడులో పార్టీ రాజకీయ ఆశయాల గురించి మాట్లాడుతున్న మురుగన్, "అసెంబ్లీ ఎన్నికలు కేవలం నాలుగు నెలల దూరంలో ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ శక్తిగా అవతరిస్తుంది. పార్టీ ఎవరిని ఎంచుకుంటుందో వారు ముఖ్యమంత్రి కావచ్చు" అని అన్నారు. తమిళనాడులో తదుపరి ప్రభుత్వ ఏర్పాటును మేమే నిర్ణయిస్తాం" అని మురుగన్‌ నొక్కిచెప్పారు.

Tags :

Advertisement