Advertisement

పుదుచ్చేరిలో తీరం దాటిన ‘నివర్’ తుఫాను

By: chandrasekar Thu, 26 Nov 2020 11:12 AM

పుదుచ్చేరిలో తీరం దాటిన  ‘నివర్’ తుఫాను


అతితీవ్ర తుపానుగా ఆవిర్భవించిన 'నివర్' తుఫాను పుదుచ్చేరిలో తీరం దాటింది. తమిళనాడు, పుదుచ్చేరిలపై ప్రమాదకరంగా దూసుకువచ్చిన ‘నివర్‌’ తుపాను తీరం దాటింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరిలో తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన నేపథ్యంలో క్రమంగా బలహీనపడి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారిందని స్పష్టం చేసింది. ఇప్పటికే నివర్‌ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసింది.

ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు మరియు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటికి గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని నాలుగు జిల్లాలు తిరువన్నమలై, కడలూర్, కల్లకురిచ్చి, విళుపురం తో పాటు పుదుచ్చేరిలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తీరం దాటిన తరువాత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుఫాన్ తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలిల కారణంగా భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలు/ తోటలకు నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆస్తినష్టం మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం వుంది. చాలా ప్రాంతాల్లో కరెంటు తీయడంవల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు.

Tags :
|
|

Advertisement