Advertisement

మరింత తీవ్ర రూపం దాల్చిన నివర్ తుఫాన్

By: Sankar Tue, 24 Nov 2020 5:27 PM

మరింత తీవ్ర రూపం దాల్చిన నివర్ తుఫాన్


బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన నివర్‌ తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్‌ చెన్నై ఆగ్నేయం దిశగా 420 కిమీ వేగంతో పుదుచ్చెరి చుట్టూ కారైకల్‌, మామల్లపురం, తమిళనాడు తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో 24 గంటల్లో నివర్‌ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల రేపు, ఎల్లుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి ప్రభుత్వాలు రక్షణ చర్యల్లో భాగంగా సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నాయి.

అయితే నిన్నటి నుంచి చెన్నై, కరైకల్‌, నాగపట్నంలో కురిసిన వర్షం కారణంగా చెన్నై పోర్టులో 6వ నంబర్‌ వద్ద తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో 100 కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో కడలూరు పోర్టులో 7వ నంబర్‌ వద్ద అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో కూడా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement