Advertisement

  • రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస నుండి కొత్త కరెన్సీ విడుదల చేయనున్న నిత్యానంద

రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస నుండి కొత్త కరెన్సీ విడుదల చేయనున్న నిత్యానంద

By: chandrasekar Wed, 19 Aug 2020 09:50 AM

రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస నుండి కొత్త కరెన్సీ విడుదల చేయనున్న నిత్యానంద


రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ కైలాస నుండి కొత్త కరెన్సీ విడుదల చేయనున్న నిత్యానంద ప్రకటించాడు. దేశంలో సంచలనం సృష్టించిన వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాను స్థాపించిన ‘కైలాస’ దేశంలో సొంతంగా రిజర్వు బ్యాంక్‌ను ఏర్పాటుచేసినట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ కైలాసగా పేరు పెట్టినట్లు తాజా వీడియోలో వెల్లడించారు. అన్ని కూడా చట్ట ప్రకారమే జరుగుతున్నట్లు తెలియజేసారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగష్టు 22న కరెన్సీని విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధమయ్యాయని, చట్టబద్ధంగానే ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తావుంది.

ఇంతకు పూర్వం లైంగిక దాడి ఆరోపణలతో బాటు అనేక కేసులను ఎదుర్కొంటున్న నిత్యానంద విచారణ నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం హిందువుల కోసం కైలాస పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటుచేసినట్లు గత డిసెంబర్‌లో అతడు సంచలన ప్రకటన చేశారు.

ఆ దేశానికి సొంత జెండాతో బాటు చిహ్నం కూడా రూపొందించినట్లు పేర్కొన్నాడు. క్యాబినెట్‌ను సైతం ఏర్పాటుచేసినట్ల్లు ప్రకటించాడు. అయితే ఆ దేశం గురించి పూర్తి వివరాలు అందాల్సి వుంది. కాగా, 4 లక్షల డాలర్ల అక్రమాలకు సంబంధించి ఫ్రెంచి అధికారులు కూడా అతడిపై విచారణ జరుపుతున్నారు. ఈ రకంగా అనేక సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న నిత్య నందా ఎప్పుడు పోలీసులు దొరుకుతాడో వేచిచూడాల్సిందే నంటున్నారు అందరు.

Tags :

Advertisement