Advertisement

నితిన్ కొత్త సినిమా షూటింగ్ దుబాయిలో షురూ

By: Sankar Sun, 06 Dec 2020 9:33 PM

నితిన్ కొత్త సినిమా షూటింగ్ దుబాయిలో షురూ


నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న చిత్రం షూటింగ్ ఆదివారం దుబాయ్‌లో మొద‌లైంది. హీరో హీరోయిన్లు నితిన్‌, న‌భా న‌టేష్‌పై దుబాయ్‌లో స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఫిల్మ్ షూటింగ్ మొద‌లైన విష‌యాన్ని త‌న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియ‌జేసిన నితిన్‌.. సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. ఇది నితిన్‌కు 30వ సినిమా. అంతేకాదు, హిందీ మూవీ ‘అంధాదున్’కు తెలుగు రీమేక్..

నితిన్ షేర్ చేసిన ఫొటోలో ఆయ‌న‌ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు. ఈ మూవీలో త‌మ‌న్నా భాటియా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి జ‌రిగే త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొన‌నున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Tags :
|
|

Advertisement