Advertisement

నిర్మలా సీతారామన్ రుణ గ్రహీతలకు తీపికబురు

By: chandrasekar Fri, 04 Sept 2020 10:04 AM

నిర్మలా సీతారామన్ రుణ గ్రహీతలకు తీపికబురు


కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో లోన్ తీసుకున్న వారికి ఊరట కలిగే నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకులను, ఎన్‌బీఎఫ్‌సీలను కోరారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో నిర్మల మాట్లాడుతూ... బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు వెంటనే బోర్డు ఆమోదిత పాలసీలను కలిగి ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన రుణ గ్రహీతలను గుర్తించాలని వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకోవాలని, వన్‌టైమ్ రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రయోజనాన్ని అందించాలని తెలియచేసారు. ఇదంతా సెప్టెంబర్ 15లోగా పూర్తి కావాలని ఆదేశించారు.

రుణ గ్రహీతలకు మీరు అందిస్తున్న రెజల్యూషన్ స్కీమ్స్ గురించి వారికి తెలిసేలా మీడియా ప్రచారం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ బ్యాంకులకు తెలియచేసారు. అంతేకాకుండా ఈ స్కీమ్స్‌కు సంబంధించిన ప్రశ్నలను సమాధానాలు కస్టమర్లకు తెలిసేలా బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని వివరించారు. ఇవి హిందీ, ఇంగ్లీష్ సహా ప్రాంతీయ భాషాల్లోనూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించారు. ఇకపోతే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో కార్పొరేట్, రిటైల్ రుణాల వన్‌టైమ్ పునర్‌వ్యవస్థీకరణకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement