Advertisement

ధర్నాకు దిగిన నిమ్స్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ..

By: Sankar Fri, 17 July 2020 2:43 PM

ధర్నాకు దిగిన నిమ్స్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ..


ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ సౌర్సింగ్ ఉద్యోగులు వరుసగా ధర్నాలు చేస్తున్నారు ..మొన్ననే గాంధీ ఆసుపత్రి అవుట్ సౌర్సింగ్ సిబ్బంది ధర్నా చేయడంతో ప్రభుత్వం వారి సమస్యలకు పరిష్కారం చూపెట్టిన విషయం తెలిసిందే..తాజాగా నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్) ఆస్ప‌త్రిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళ‌న చేప‌ట్టారు.

వేత‌నాలు పెంచాల‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరుతూ అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల‌లో ప‌ని చేస్తున్న అకౌంటెంట్లు, క్ల‌ర్కులు శుక్ర‌వారం కోఠి ప‌బ్లిక్ హెల్త్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌నకు దిగారు. కోవిడ్ కాలంలో తీవ్ర ప‌ని ఒత్తిడితో ఇబ్బంది ప‌డుతున్నామ‌ని వారు వాపోయారు. త‌మ జీతాలు పెంచ‌క‌పోతే వ‌చ్చే నెల నుంచి స‌మ్మెకు వెళ‌తామ‌ని హెచ్చ‌రించారు.

మ‌రోవైపు ఉస్మానియా ఆస్ప‌త్రిలోనూ త‌మ‌కు స‌రిగా జీతాలు చెల్లించ‌‌డం లేద‌ని అక్క‌డి పారామెడిక‌ల్‌, టెక్నిక‌ల్ సిబ్బంది ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అయితే కరోనా తో రాష్ట్రము అల్లాడుతున్న సమయంలో కీలక పాత్ర వహించే గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది ఇలా ఒక్కొకరుగా ధర్నాలు చేస్తుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు ..

Tags :
|

Advertisement