Advertisement

  • ఉద్యోగులకు ఆరు లక్షల షేర్లు ఉచితంగా ఇచ్చిన యజమాని

ఉద్యోగులకు ఆరు లక్షల షేర్లు ఉచితంగా ఇచ్చిన యజమాని

By: Sankar Thu, 27 Aug 2020 5:42 PM

ఉద్యోగులకు ఆరు లక్షల షేర్లు ఉచితంగా ఇచ్చిన యజమాని


ఒక కంపెనీ వృద్దిలోకి రావాలంటే ఆ కంపెనీ పెట్టిన యజమానిది ఎంత కష్టం ఉంటుందో అందులో పనిచేసే ఉద్యోగులది అంతే కష్టం ఉంటుంది..అయితే యజమాని పెట్టుబడి పెడతాడు కాబట్టి ఉద్యోగులకు కేవలం జీతాలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపిలేసుకుంటాడు..కానీ ఇప్పుడు చెప్పుకునే యజమాని మాత్రం ఆలా కాదు..తన కంపెనీ వృద్ధిలోకి రావడానికి కష్టపడినా ఉద్యోగులకు తన షేర్లలో వాటా ఇస్తున్నట్లు ప్రకటించాడు..

అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ కంపెనీ నికోలా వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన ట్రెవర్ మిల్టన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తొలి 50 మంది ఉద్యోగులకు తనకు చెందిన 233 మిలియన్ డాలర్ల (రూ.1721.32 కోట్లు) విలువైన ఆరు లక్షల షేర్లు (ఒక్కొక్కరికి సుమారు 34.5 కోట్ల విలువైన షేర్లు) ఇస్తానని చెప్పారు. వారిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఈ హామీ ఇచ్చానని, దీనిని తాను నెరవేర్చేతున్నట్లు ఆయన తెలిపారు. తాను ఈ కంపెనీని ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం చూశానని, అలాంటి వారిని పొందటం చాలా కష్టమని ట్రెవర్ మిల్టన్ అన్నారు.

‘నేను నా ఉద్యోగులను ప్రేమిస్తాను. వారంతా నికోలాను గొప్పస్థాయికి తెచ్చారు. ఈ సంస్థ విజయానికి వారే కారణం. నేను నియమించిన తొలి 50 మంది ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నాను. నాకు చెందిన 6 లక్షల షేర్లను వారికి ఇస్తాను. వాటిని వారికి అమ్మడం లేదు. ఉచితంగా ఇస్తున్నాను. దీని వల్ల నా షేర్లు, సంపద తగ్గుతాయి’ అని గురువారం ట్వీట్ చేశారు. మనం మరింతగా పని చేస్తే భవిష్యత్తులో ఇది బిలియన్లకు చేరుతుందని చెప్పారు.

Tags :
|

Advertisement