Advertisement

  • పంజాబ్ రాష్ట్రంలో జనవరి ఒకటి వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు

పంజాబ్ రాష్ట్రంలో జనవరి ఒకటి వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు

By: Sankar Fri, 11 Dec 2020 9:17 PM

పంజాబ్ రాష్ట్రంలో జనవరి ఒకటి వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు


దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి..ఎందుకంటే దేశంలో ఇంకా రెండు మూడు నెలలు చలి కాలమే కావడంతో చలి మాటున కరోనా పెరిగే ప్రమాదం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

దీంతో.. ఆయా రాష్ట్రాల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.. ఇక, పంజాబ్‌లో కోవిడ్ కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. నైట్ క‌ర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం అమరేందర్ సింగ్.. ఇటీవ‌ల డిసెంబ‌ర్ 1 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ ప్రభుత్వం.. ఇవాళ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మై సీఎం అమరేందర్ సింగ్.. కేసుల తీవ్రతపై చర్చించారు..

కొత్త కేసులు తగ్గుముకం పట్టకపోవడంతో.. నైట్ కర్ఫ్యూను జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది.. ఈ సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది సర్కార్.

Tags :
|

Advertisement