Advertisement

17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్

By: chandrasekar Fri, 09 Oct 2020 09:26 AM

17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్


ఐపీల్ అంటేనే పరుగుల వేట అందులో కూడా తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అదరగొట్టాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 2018లో కేఎల్ రాహుల్ ఢిల్లీపై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా పూరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. నికోలస్ పూరన్ ను అవుట్ చేయడానికి హైదరాబాద్ చాలా కష్టపడింది.

నికోలస్ పూరన్ అన్ని వైపులా పరుగుల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అబ్దుల్ సమద్‌ను టార్గెట్ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా 6, 4, 6, 6, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 28 రన్స్ రావడంతోపాటు పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి అర్ధ శతకం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సులు బాది 37 బంతుల్లోనే 77 రన్స్ చేసిన పూరన్ రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మిగతా బౌలర్లతో ఆటాడుకున్న పూరన్ రషీద్ ఓవర్లో సింగిల్ తీసే అవకాశం వచ్చినా తీయకుండా నాలుగు బంతులను చక్కగా ఎదుర్కొన్నాడు. కానీ ఐదో బంతికి నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కాసేపటికే పంజాబ్ అల్ అవుట్ అవ్వడంతో నిరాశ పరిచింది.

Tags :
|

Advertisement