Advertisement

  • బెంగ‌ళూరులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

బెంగ‌ళూరులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

By: chandrasekar Fri, 09 Oct 2020 2:27 PM

బెంగ‌ళూరులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ


బెంగ‌ళూరులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్‌) అనే ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందినవారుగా అనుమానిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఐసిస్ విభాగం స‌భ్యులుగా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు.

దేశంలో ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఎన్ఐఏ గాలిస్తున్నారు. ఇటీవ‌ల బెంగ‌ళూరులో ఉగ్ర‌వాద స్థావ‌రం బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ ఉగ్ర‌వాదుల కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. ఇక్కడ గురువారం ఎన్ఐఏకు ప‌ట్టుబ‌డ్డ ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల్లో ఒక‌రు త‌మిళ‌నాడు రాష్ట్రం రామేశ్వ‌రానికి చెందిన అబ్దుల్ అహ్మ‌ద్ క‌దీర్ (40), మ‌రొక‌రు బెంగ‌ళూరుకు చెందిన ఇర్ఫాన్ న‌జీర్ అని అధికారులు తెలిపారు.

పట్టుబడ్డ క‌దీర్ చెన్నైలోని ఓ బ్యాంకులో బిజినెస్ అన‌లిస్ట్‌గా ప‌నిచేస్తుండ‌గా, న‌సీర్ బెంగ‌ళూరులో బియ్యం వ్యాపారం చేస్తున్నాడ‌ని చెప్పారు. గురువారం బెంగ‌ళూరులో ఇద్ద‌రూ ఒకేచోట ఉన్న‌ప్పుడు ప‌ట్టుకున్నామ‌ని వెల్ల‌డించారు. నిందితుల‌ను కోర్టు ముందు హాజరుప‌ర్చ‌గా 10 రోజుల క‌స్ట‌డీ విధించింద‌ని తెలిపారు. ‌విచారణలో వీరినుండి మరిన్ని విషయాలు రాబట్టవచ్చు.

Tags :
|
|

Advertisement