Advertisement

  • భారత జట్టులో అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం ..కివీస్ పేసర్ లూకి ఫెర్గుసన్

భారత జట్టులో అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం ..కివీస్ పేసర్ లూకి ఫెర్గుసన్

By: Sankar Thu, 30 July 2020 8:37 PM

భారత జట్టులో అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం ..కివీస్ పేసర్ లూకి ఫెర్గుసన్



టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్​ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన బ్యాట్స్​మన్ అని, అతడికి బౌలింగ్ చేయడం చాలా సవాల్​గా అనిపించిందని గురువారం ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. అలాగే డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ కూడా గొప్ప ఆటగాళ్లంటూ చెప్పుకొచ్చాడు. తాను బౌలింగ్ చేసేందుకు సవాల్​గా అనిపించిన బ్యాట్స్​మెన్ ఎవరు అని అడిగిన ఓ ప్రశ్నకు ఫెర్గూసన్​ సమాధానం ఇచ్చాడు.

“కొందరు ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం బాగా సవాల్​గా అనిపిస్తుంది. అతడిని త్వరగా ఔట్ చేయలేకపోతే, భారీగా బాదేస్తాడు. లెంగ్త్​ను త్వరగా పసిగడతాడు. అతడో వరల్డ్​ క్లాస్ ప్లేయర్​. స్టీవ్​ స్మిత్, డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఆటగాళ్లు. వారికి బౌలింగ్ చేయడం ఎప్పుడైనా కష్టమే. అయితే టాపార్డర్​లో ఉన్న వారిని ఔట్ చేయడం బాగా అనిపిస్తుంది. టాపార్డర్​ను పెవిలియన్​కు పంపితేనే మిడిల్​ ఆర్డర్​, లోయరార్డర్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం వస్తుంది కదా” అని ఫెర్గూసన్ చెప్పాడు..

కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో కోహ్లీ , రోహిత్ లు లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో అదరగొడుతున్నారు ..కానీ గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద ఈ ఇద్దరు తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలు అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది ..

Tags :
|

Advertisement