Advertisement

  • తైవాన్ తమ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవ౦: చైనా

తైవాన్ తమ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవ౦: చైనా

By: chandrasekar Sat, 05 Sept 2020 1:26 PM

తైవాన్ తమ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవ౦: చైనా


చైనా రక్షణ మంత్రిత్వశాఖ.. సీసీపీ ఎస్‌యూ-35 విమానాన్ని తైవాన్ కూల్చినట్లు ఇంటర్నెట్‌లో వ్యాప్తి చెందిన వార్త నిజయం కాదని తెలిపింది. ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారాన్ని సృష్టించి ప్రచారం చేయడాన్ని చైనా వైమానిక దళం తీవ్రంగా ఖండిస్తున్నదని చైనా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

తైవాన్ తమ దేశంలో భాగమని చైనా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా యుద్ధవిమానాన్ని తైవాన్ కూల్చినట్లు ఇంటర్నెట్‌లో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. కాగా ఇది తప్పుడు సమాచారమని చైనా ఖండించింది.

ఇటీవల చెక్ రిపబ్లిక్ స్పీకర్‌ మిలోస్ వైస్ట్రిల్ తైవాన్‌ను సందర్శించి ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. తాను కూడా తైవాన్‌కు చెందినవాడినని ఆయన చెప్పారు. కాని ఆయన పర్యటనపై తైవాన్‌ మండిపడింది. త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి హెచ్చరించారు. అయితే చైనా బెదిరింపులను మిలోస్ తిప్పికొట్టారు. తమ దేశ విదేశీ విధానం మేరకు తైవాన్‌ను అధికారికంగా సందర్శించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు తైవాన్ కూడా చెక్ రిపబ్లిక్ స్పీకర్‌పై చైనా అసభ్య బెదిరింపులను ఖండించింది.

Tags :
|
|
|

Advertisement