Advertisement

  • ఒప్పో నుండి కొత్తగా రోలబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్

ఒప్పో నుండి కొత్తగా రోలబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్

By: chandrasekar Wed, 18 Nov 2020 07:40 AM

ఒప్పో నుండి కొత్తగా రోలబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్


ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కొత్తగా రోలబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన రోలబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్, ఏఆర్ గ్లాసెస్‌ను ప్రదర్శించింది. ఒప్పో ఇన్నో డే 2020లో వీటిని ఒప్పో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒప్పో ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించే లాగా మూడు ట్వీట్లను కూడా చేసింది. రోలబుల్ ఓఎల్ఈడీ స్క్రీన్ స్మార్ట్ ఫోన్‌కు ఒప్పో ఎక్స్ 2021 అని పేరు పెట్టింది. ఏఆర్ గ్లాసెస్‌కు ఒప్పో ఏఆర్ గ్లాస్ 2021ను కంపెనీ లాంచ్ చేసింది. రెండు డిస్ ప్లే సైజుల మధ్య సులభంగా రోల్ చేసేందుకు వీలుగా ప్రొప్రెయిటరీ రోల్ మోటర్ పవర ట్రైన్‌ను ఇందులో అందించారు. ఏఆర్ గ్లాస్ 2021కు సంబంధించిన వివరాలను కంపెనీ షేర్ చేయలేదు. ఒప్పో ఇన్నో డే 2020లో సందర్భంగా కంపెనీ ఈ కొత్త తరహా స్మార్ట్ ఫోన్‌ను రివీల్ చేసింది. ఒప్పో ఎక్స్ 2021 స్మార్ట్‌ఫోన్‌లో రోలబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ మామూలుగా ఉన్నప్పుడు 6.7 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు.

ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌టెండ్ చేసినప్పుడు స్క్రీన్ సైజ్ 7.4 అంగుళాలుగా ఉండనుంది. ఇందులో కర్వ్‌డ్ అంచులను అందించారు. ఫోన్ కింద వైపు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్స్ అందించనున్నారు. ఇందులో అత్యంత బలమైన స్క్రీన్ ల్యామినేట్‌ను అందించారు. ఒప్పో దీనికి వార్ప్ ట్రాక్ అనే పేరు పెట్టింది. ఇది స్క్రీన్‌ను బలోపేతం చేయనుంది. ఒప్పో ఎక్స్ 2021 16:9, 4:3 యాస్పెక్ట్ రేషియో ఉన్న కంటెంట్‌కు ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒప్పో ఏఆర్ గ్లాస్ 2021 విషయానికి వస్తే దీనికి సంబందించిన సమాచారం పెద్దగా కంపెనీ అందించలేదు. అయితే ఇందులో టైం ఆఫ్ ప్లైట్ (టీఓఎఫ్) సెన్సార్, స్లామ్ (సైమల్టేనియస్ లోకలైజేషన్ అండ్ మ్యాపింగ్), డిఫ్రాక్టివ్ ఆప్టికల్ వేవ్ గైడ్ టెక్నాలజీ, గెస్చర్, వాయిస్ నావిగేషన్ వంటి ఫీచర్లు అందించనున్నారు. ఈ గ్లాస్‌కు సన్నని డిజైన్ అందించనున్నట్లు కనిపిస్తుంది. ఇవి రెండూ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఒప్పో తెలియజేయలేదు. కానీ వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Tags :
|
|
|

Advertisement