Advertisement

  • పెళ్లి అయిన నాలుగు రోజులకే పెళ్లి కొడుకు ఆత్మహత్య ..

పెళ్లి అయిన నాలుగు రోజులకే పెళ్లి కొడుకు ఆత్మహత్య ..

By: Sankar Tue, 28 July 2020 09:59 AM

పెళ్లి అయిన నాలుగు రోజులకే పెళ్లి కొడుకు ఆత్మహత్య ..



పెళ్లి అయితే ఎన్నో ఆశలతో వధువు అత్తగారింట్లో అడుగు పెడుతుంది ..కొత్త జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ న వధువుకు పెళ్లి అయిన నాలుగు రోజులకే భర్త చనిపోయాడు అని వార్త తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ..సరిగ్గా ఇలాంటి సంఘటనే ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది ..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పుట్టచెరువుపాలేనికి చెందిన ఎస్‌.వేణు(30) ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. సరైన ఉద్యోగం రాకపోవడంతో గ్రామంలోనే పొలం పనులు చేసుకుంటూ చిట్టీలు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలోనే జరుగుమల్లి మండలం పమిడిపాడుకు చెందిన ఓ యువతితో అతడిక ఈ నెల 24న వివాహమైంది..

ఇంతలోనే ఏమైంధో ఏమో సోమవారం వేణు తాళ్లూరు మండలం సూరాయపాలెంలోని సుబాబుల్‌ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వేణు సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయినా నాలుగో రోజు అతడు ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టచెరువుపాలెంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Tags :
|
|

Advertisement