Advertisement

102 రోజుల తర్వాత ఆ దేశంలో కరోనా మరణం

By: Sankar Fri, 04 Sept 2020 4:19 PM

102  రోజుల తర్వాత ఆ దేశంలో కరోనా మరణం


ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి దాటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ..అమెరికా , బ్రెజిల్ , ఇండియా , రష్యా వంటి దేశాలలో ఇప్పటికి కూడా కొన్ని వేల సంఖ్యలో రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..అయితే ఒక్క దేశం మాత్రం కరోనా ను కట్టడి చేయడంలో విజయం సాధించింది..ఆ దేశమే న్యూజిలాండ్..అయితే న్యూజిలాండ్ లో దాదాపు మూడు నెలల తర్వాత కరోనా మరణం సంభవించింది..

మే 24 వ తేదీ తరువాత ఆ దేశంలో ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదు. దాదాపుగా వంద రోజుల తరువాత న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆక్లాండ్ లో కరోనా కేసులు నమోదు కావడంతో రెండు వారాలపాటు కఠిన లాక్ డౌన్ విధించారు. సెప్టెంబర్ రెండో వారం వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం పేర్కొన్నది. 102 రోజుల తరువాత 50 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందింది.

దీంతో మొత్తం న్యూజిలాండ్ లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 23 కి చేరింది. దాదాపుగా మూడు నెలల తరువాత న్యూజిలాండ్ లో కరోనా మరణం సంభవించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. న్యూజిలాండ్ దేశంలో కరోనా అప్రమత్తత లెవల్ 2గా ప్రకటించారు. దేశంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలి.


Tags :
|
|

Advertisement