Advertisement

  • షియోమి నుంచి సూపర్ ఫీచర్స్ తో కొత్త ఇయర్ బడ్స్...

షియోమి నుంచి సూపర్ ఫీచర్స్ తో కొత్త ఇయర్ బడ్స్...

By: chandrasekar Tue, 20 Oct 2020 12:27 PM

షియోమి నుంచి సూపర్ ఫీచర్స్ తో కొత్త ఇయర్ బడ్స్...


ప్రస్తుత పరిస్థితులలో ఎలక్ట్రానిక్ కంపెనీల స్మార్ట్ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు మార్కెట్లో మంచి డిమాండ్ పెరిగింది. అందుకే ఈ రంగంలో దూసుకుపోతున్న చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ షియోమీ సంస్థ ఎంఐ ఎయిర్2 ప్రో పేరుతో నూతన వైర్లెస్ ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చే ఈ ఇయర్ బడ్స్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం షియోమి ఇంకా ప్రకటించలేదు. కాగా, ఈ సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు 3-మైక్ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ కు, 35 డెసిబెల్‌ వరకు సౌండ్ సపోర్ట్ తో వస్తాయని పేర్కొంది. అంతేకాక, దీనిలో మెరుగైన బేస్ మరియు సౌండ్ క్వాలిటీ కోసం 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించినట్లు షియోమీ తెలిపింది. ఈ ఎంఐ ఎయిర్2 ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు సిలికాన్ ఇయర్-టిప్స్ మరియు స్టెమ్ డిజైన్ ఇయర్ బడ్స్ ఆకారంలో అందుబాటులోకి రానున్నాయి. కాగా, దీని కేస్ డిజైన్ ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 ను పోలి ఉంటుందని షియోమీ పేర్కొంది. ఈ వైర్లెస్ ఇయర్బడ్స్ ఛార్జింగ్ కేసుతో పాటు సుమారు 28 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో రానుంది.

అయితే, ఛార్జింగ్ కేస్ లేకుండానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో సుమారు 7 గంటల వరకు ఇది పని చేస్తుందని షియోమీ పేర్కొంది. ఎంఐ ఎయిర్ ప్రో2 వైర్‌లెస్ బడ్స్ను బ్లూటూత్ 5.0 ద్వారా మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ చార్జింగ్ కోసం టైప్సి యుఎస్బీ కేబుల్ను ఉపయోగించాలని షియమి తెలిపినిది. ఈ ఇయర్‌ఫోన్‌లు పూర్తిగా ఛార్జ్ చేయడానికి గంట సమయం పడుతుంది. కాగా, ఈ ఇయర్ బడ్స్ ను 10 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే 90 నిమిషాల ప్లేబ్యాక్ టైంను అందిస్తుంది. ఇవి సుమారు10 మీటర్ల ఆపరేటింగ్ డిస్టన్స్ వరకు పనిచేస్తాయని షియోమి తెలిపింది. దీని బరువు కేవలం 60 గ్రాములు మాత్రమే ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ .7,660గా ఉంటుంది. షియోమీ 80W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ను ఇటీవలే సాధించినట్లు ప్రకటించింది. 80W వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా కేవలం 19 నిమిషాల్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. కాగా, షియోమి, ఈ ఏడాది ప్రారంభంలో, 40W మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ డివైజెస్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Tags :
|
|

Advertisement