Advertisement

జర్మనీలో పందుల నుంచి కొత్త వైరస్

By: chandrasekar Fri, 11 Sept 2020 6:05 PM

జర్మనీలో పందుల నుంచి కొత్త వైరస్


ప్రపంచమే కరోనా తో అల్లాడుతున్న ఈ సమయంలో మరొక్క కొత్త వైరస్ జర్మనీలో వెలుగు చూసింది. కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. ఈ క్రమంలో జర్మనీలో కొత్త వైరస్ వెలుగుచూసింది. ఇది ఒక అడివి పంది మృతదేహంలో కనిపించింది. ఈ ప్రమాదకర వైరస్ వల్ల స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. పంది మాంసాన్ని ఎగుమతి, దిగుమతి చేసుకునే దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. జర్మనీలోని తూర్పు రాష్ట్రమైన బ్రాండెన్బర్గ్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఉన్న ఓ అనుమానిత కేసు వెలుగుచూసిందని జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రజలలో మరింత ఆందోళన కలిగించే విధంగా వుంది.

ఈ కొత్త వైరస్ పోలిష్ సరిహద్దు సమీపంలో దొరికిన అడవి పంది మృతదేహంలో గుర్తించినట్లు పేర్కొంది. జర్మనీ జంతు ఆరోగ్య సంస్థలో దీనిపై మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి జూలియా క్లోక్నెర్ వెల్లడించారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. స్వైన్ ఫీవర్ వైరస్ అనేది ప్రధానంగా అడవి పందుల్లో కనిపిస్తుంది. అనారోగ్య, ఆరోగ్యకరమైన జంతువుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా, అలాగే వైరస్ సోకిన మాంసాన్ని కలిగి ఉన్న చెత్తను తినడం ద్వారా పందులకు వ్యాపిస్తుంది. మృదువైన పేల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే, ఇది మనుషులకు ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పోలాండ్లో ఇటీవల ఈ వైరస్ కేసులు ఎక్కువగా వెలుగుచూశాయి. అక్కడ పందుల్లో దాదాపు 3,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఈ వైరస్ మరింత ఎక్కువైతే కరోనా లాగా దేశ ఆర్ధిక శక్తి దిగజారనుంది. కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న జర్మనీని స్వైన్ ఫీవర్ వైరస్ వ్యాప్తి కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. కరోనాతో దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడు స్వైన్ ఫీవర్తో ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తగులనున్నది. వివిధ దేశాలకు పందులను జర్మనీ ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా చైనాకు పందుల అతిపెద్ద ఎగుమతిదారు జర్మనీనే. ఇప్పుడు స్వైన్ ఫీవర్ కేసు నమోదైనందున ఎగుమతులను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లనుంది. జర్మనీ పందుల ఎగుమతిని నిషేధిస్తే అమెరికాకు డిమాండ్ పెరుగుతుందని ఆర్చర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ స్మిత్ అభిప్రాయపడుతున్నాడు. ఇటు ఆర్ధికంగానూ అటు అనారోగ్యం కూడా భయపెడుతుంది.

Tags :
|
|
|
|

Advertisement