Advertisement

  • హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ జీవితకాలం రద్దు...

హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ జీవితకాలం రద్దు...

By: Sankar Thu, 05 Nov 2020 12:16 PM

హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ జీవితకాలం రద్దు...


మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. వీటిని అనేక రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి.

హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ పై సస్పెన్షన్ విధిస్తారు. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ ను జీవితకాలం రద్దు చేస్తారు. ఇక ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ లకు నిబంధనలను ఈ నిబంధనలు వర్తిస్తాయని అంటున్నారు.

నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేస్తేనే సురక్షితంగా ఎలాంటి ఫైన్లు లేకుండా ఇంటికి చేరుకోవచ్చు. లేదంటే జేబులు ఖాళీ కావడంతో పాటుగా లైసెన్స్ కూడా రద్దు అవుతుంది.

Tags :
|

Advertisement