Advertisement

  • ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్

ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్

By: Sankar Tue, 29 Sept 2020 3:43 PM

ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్

ప్రతీ పదేళ్లకు ప్రజలు మార్పును కోరుకుంటారు.. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ అయిన తర్వాత తొలిసారిమాట్లాడిన ఆయన.. జట్టుగా పనిచేసి 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు..

ప్రతీ 10 ఏళ్లకు ప్రజలు మార్పును కోరుకుంటారు... రానున్న కార్పొరేషన్ల ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీఎన్నికలకు చాలా పగడ్బందీగా వ్యూహం రచిస్తున్నామని తెలిపారు. ప్రతి రెండు గ్రామాలను ఒక్కో నాయకుడికి అప్పగించి, ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తారన్న మాణిక్యం ఠాగూర్... తెలంగాణలో చంద్రశేఖర్ సర్కార్ లో కుటుంబం, కుమారుడు, మేనల్లుడు చేసే అవినీతి గురించి ప్రజలకు చెబుతామని వెల్లడించారు.

ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచి, వచ్చిన అవినీతి సొమ్మును పంచుతున్నారని ప్రజలకు వివరిస్తామన్న కాంగ్రెస్ ఇంచార్జ్... రూపొందించబోయే పటిష్టమైన జట్టులో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మార్పుపై ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు మాణిక్యం ఠాగూర్.. తెలంగాణ పర్యటనపై సోనియా గాంధీకి నివేదిక అందజేస్తానని తెలిపారు. ఎన్నికలకు ఎవైనా.. అభ్యర్ధుల ఎంపికలో పార్టీ కార్యకర్తలకు, క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకుల అభిప్రాయానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామన్నారు

Tags :
|

Advertisement