Advertisement

చైనాలో కొత్త SFTS వైరస్

By: chandrasekar Thu, 06 Aug 2020 8:22 PM

చైనాలో కొత్త  SFTS వైరస్


చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలో కొత్త వైరస్ గురించి ఇప్పటికే WHO హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో జూలై నెలలో SFTS వైరస్ సుమారు 37 మందికి సోకింది. SFTS వైరస్ వల్ల ఏడుమంది మరణించారని సమాచారం.

చైనా అధికారికి మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వైరస్ మనుషులకు సంక్రమిస్తుంది అని తెలిపింది. చైనాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న జియాంగ్సు ప్రావిన్స్ లో SFTS వైరస్ ను గుర్తించారు. ముందుగా ఈ ప్రాంతంలో ఒక మహిళకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి.

పరీక్షలో తేలిసిన విషయం ఏంటంటే ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్ లెట్స్ బాగ తగ్గాయి. వైద్యులు ఆమెకు ఒక నెల వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు. SFTS వైరస్ వల్ల ఇప్పటి వరకు సుమారు ఏడు మంది మరణించారట. అయితే ఈ SFTS Virus కొత్తదేమీ కాదు. చైనాలో దీన్ని 2011 లోనే కనుక్కున్నారు. SFTS వైరస్ పశువుల శరీరానికి అంటుకుని తరువాత మనుషులకు సోకుంతుందట. దీనిని నల్లి వంటి క్రిములు వ్యాపింప చేస్తాయట. కరోనాకి ముందు తరువాత చైనాలో వైరస్ లు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement